/rtv/media/media_files/2025/04/09/1ykjCbPJpacVAkolICHb.jpg)
Shardul Thakur bowled 11 balls in an over in the match against KKR
ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకు మించి రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం పలు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో టైటిల్ కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్లు వరుస ఓటములను ఎదుర్కొంటున్నాయి.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన జట్లు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం అందరి అంచనాలకు మించి అద్భుతాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఎవరి ఊహలకు అందని చెత్త రికార్డులతో వార్తల్లో నిలుస్తున్నారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
చెత్త రికార్డు
ఈ 2025 సీజన్‌లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రీసెంట్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించినా.. శార్ధూల్ ఠాకూర్ మాత్రం ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. కేవలం ఒక్క ఓవర్‌లోనే 11 బాల్స్ వేశాడు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
Shardul Thakur bowls longest over in IPL
— Rajni (@rajniar25) April 9, 2025
LSG fast bowler Shardul Thakur on Tuesday bowled the joint-longest over in IPL. The 33-year-old bowled a total of 11 deliveries in his third over against KKR. pic.twitter.com/UI1dWZ7DbI
Also Read: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
అది మాత్రమే కాకుండా వరుసగా 5 వైడ్లు వేశాడు. ఇది కూడా 2025 సీజన్‌లో ఒక చెత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్ గా శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన శార్ధూల్ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
(shardul-thakur | IPL 2025 | latest-telugu-news | telugu-news | sports-news)