/rtv/media/media_files/2025/03/22/pTLAm0FQ5bTfJ3Rimx7V.jpg)
RCb Batter salt half century
అసలు అవ్వదనుకున్న మ్యాచ్ వరుణుడు దయ వల్ల జరుగుతోంది. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. ఛేదనకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మొదట నుంచి దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్స్ చెమటలు పట్టిస్తున్నారు. ఓపెనర్లుగా దిగిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు వికెట్ కోల్పోకుండా..నిలకడగా ఆడుతున్నారు. ఈక్రమంలో సాల్ట్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ ప్రస్తుతం 34 పరుగుల దగ్గర ఉన్నాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా టీమ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన క్వింటన్ డికాక్(4) పరుగులకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
today-latest-news-in-telugu | ipl-2025 | rcb