/rtv/media/media_files/2025/04/13/chibBYhyMJeEuHfTODnO.jpg)
RCB VS RR Photograph: (RCB VS RR)
బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
టాస్ గెలిచి బౌలింగ్
మొదట టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్, జైస్వాల్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్ (15) ఔట్ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్ పరాగ్ (30), జైస్వాల్ (75), హెట్‌మయర్ (9), ధ్రువ్ జురెల్ (35*), నితీశ్ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు.
ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్ (65) ఔట్ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్ పడిక్కల్ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.