/rtv/media/media_files/2025/03/28/BHfPHO8R13Cu7eta1krh.jpg)
CSK VS RCB
ఐపీఎల్ లో చెన్న సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాంలెజర్స్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 7 వికెట్లు నష్టానికి 196 పరుగులు చేసింది. దీని తర్వాత సీఎస్కే 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో చెన్నై జట్టు తొందర తొందరగా వికెట్లను కోల్పోయింది. టీమ్ లో రచిన్ రవీంద్ర 41, జడేజా 25,పరుగులు చేశారు. చివర్లో మిస్టర్ కూల్ ధోనీ వరుస సిక్స్ లు, ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ధోనీ 26 పరుగుల స్కోర్ చేశారు. మిగతా బ్యాటార్లు అందరూ సింగిల్ డిజిట్లకే వికెట్లను కోల్పోయారు. ఆర్సీబీ బౌలర్లలో దయాల్, భువనేశ్వర్ కుమార్ లు రెండేసి వికెట్లు తీశారు. మొత్తానికి చెన్నై జట్టు 8 వికెట్లు కోల్ఫోయి 146 పరుగులు చేయగా...ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆర్సీబీ మొదట బ్యాటింగ్..
చెన్నై బౌలర్లు బెంగళూరు బ్యాటర్లపై విజృంభిస్తున్నారు. చాలా వరకు పరుగులను కట్టడి చేశారు. దిగ్గజ బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేర్చారు. సింగిల్ రన్ చేయడానికి కూడా బెంగళూరు జట్టు అవస్తలు పడుతుంది. దీంతో నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సీఎస్కే జట్టు ముందు 197 టార్గెట్ ఉంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లున్నాయి.
today-latest-news-in-telugu | ipl-2025 | csk-vs-rcb