RCB VS MI: దుమ్ముదులిపిన ఆర్సీబీ.. ముంబై ముందు భారీ టార్గెట్‌

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. 

New Update
RCB

RCB

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. 

Also Read: ద్రవిడ్‌లా వారిద్దరికీ చెప్పలేను.. రో-కోపై పాంటింగ్‌ షాకింగ్ కామెంట్స్!

తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఫిలిప్‌ సాల్ట్ 4 పరుగులు చేసి రెండో బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన విరాట్ కోబ్లీ దూకుడుగా ఆడాడు. 67 పరుగులు చేశాడు. విల్ జాక్స్ చేసిన 5 ఓవర్లలో కోహ్లీ ఫోర్‌ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. ఇక చివరగా 20వ ఓవ‌ర్లో.. జితేశ్ లాంగాన్‌లో క‌ళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దీంతో.. ముంబయి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది ఆర్సీబీ. 

Also Read: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఇషాంత్ శర్మకు భారీ జరిమానా

Also Read: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం

నిన్న కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఇందులో చెన్నై 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ధోనీ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. అయితే ధోనీ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇప్పుడు దుమారం రేపుతోంది. 

New Update
dhoni thaman

dhoni thaman

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా చెత్త ప్రదర్శన చేస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. కెప్టెన్సీ మారినా కూడా ఫలితం లేకుండా పోయింది. నిన్న సొంత మైదానంలో సీఎస్కే కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇందులో కెప్టెన్ ధోనీ అవుట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ధోనీ అవుట్ థర్డ్ అంపైర్ నిర్ణయం హాట్ టాపిక్ మారింది. స్పష్టంగా చూడకుండా ఔట్ ఇచ్చారని అంటున్నారు.

వివాదమవుతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం..

మొదటి బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టులో కెప్టెన్ ధోనీ ఎప్పటిలానే ఎనిమిదవ స్థానంలో వచ్చాడు. నాలుగు బాల్స్ ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు. అయితే ఈనిర్ణయం థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్ళింది. కోలకత్తా అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ ధోనీ రివ్యూకు వెళ్ళాడు. మామూలుగా ధోనీ రివ్యూకు వెళ్ళాడంటే అది అవుట్ కాదని అందరికీ ధైర్యం వచ్చేస్తుంది. కానీ ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. అప్పటికి ధోనీ పెవిలియన్ కు వెళ్ళిపోయాడు కానీ..తర్వాత థర్డ్ అంపైర్ నిర్ణయం గురించి మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. సమీక్షలో బంతి బ్యాట్‌ అంచును తాకినట్లు కొంచెం ‘స్పైక్స్‌’ కనిపించాయి. కానీ, థర్డ్ అంపైర్‌ మాత్రం ‘ఔట్‌’ ఇచ్చేశాడు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్‌ కూడా ఆశ్చర్యపోయాడు. నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పుడే ఈ నిర్ణయం రావడంతో కాస్త ఆశ్చర్యానికి గురయ్యా. అల్ట్రాఎడ్జ్‌లో వచ్చిన స్పైక్స్‌ను థర్డ్‌ అంపైర్‌ పరిగణనలోకి తీసుకున్నట్లు లేదని బౌచర్ అన్నారు. దీంతో ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ అవుట్ అవ్వగుండా ఉండి ఉంటే మరి కొన్ని రన్స్ వచ్చేవి అని...అంత చెత్తగా మ్యాచ్ ఓడిపోయే వారు కాదని అంటున్నారు. 

today-latest-news-in-telugu | IPL 2025 | csk | dhoni | out

Also Read: USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు