/rtv/media/media_files/2025/03/22/fhoSSTV4eIcQsQbg9txT.jpg)
Virat Kohli eyes 5 massive milestones in IPL 2025 as RCB
నేడే ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ కోల్‌కతా VS బెంగళూరు మధ్య జరగనుంది. దీంతో బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ 2025లో కొత్త సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ప్రారంభించనున్నందున కొన్ని భారీ రికార్డులను సాధించాలని చూస్తున్నాడు. కోహ్లీ ఇప్పటికే లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (8004 పరుగులు) ఉన్నాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న తరుణంలో అతను మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నాడు. అవేంటో తెలుసుకుందాం.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
IPL 2025లో కోహ్లీ ముందు 5 రికార్డులు:
400 T20 మ్యాచ్:
ఈడెన్ గార్డెన్స్‌లో KKR vs RCB మ్యాచ్ కోసం కోహ్లీ ఇప్పటికే గ్రౌండ్‌లో అడుగుపెట్టినప్పుడు. అతడు T20 క్రికెట్‌లో తన 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ (448), దినేష్ కార్తీక్ (412) తర్వాత 400 లేదా అంతకంటే ఎక్కువ T20 మ్యాచ్‌ల్లో ఆడిన మూడవ భారతీయుడిగా కోహ్లీ నిలుస్తాడు.
13000 T20 పరుగులు:
కోహ్లీ T20లలో మరో భారీ రికార్డును సాధించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అతడు 399 మ్యాచ్‌ల్లో 12886 పరుగులు చేశాడు. మరో 114 పరుగులు చేస్తే.. 13000 T20 పరుగులు సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నాడు.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
మూడు హాఫ్ సెంచరీలు:
కోహ్లీ T20 క్రికెట్‌లో మరో భారీ రికార్డును సాధించనున్నాడు. 100 అర్ధ సెంచరీలు చేరుకోవడానికి కొంచెం దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఈ ఫార్మాట్‌లో 97 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరో మూడు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లీ 100 అర్థ సెంచరీలు సాధించిన ప్రపంచంలో రెండవ ఆటగాడిగా అవతరిస్తాడు. మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ (108) ఉన్నాడు.
నాలుగు 50+ స్కోర్లు:
RCB లెజెండ్ కోహ్లీ ముందు IPL 2025లో మరో భారీ రికార్డు ఉంది. IPL చరిత్రలో అత్యధిక 50+ ఇన్నింగ్స్‌లు చేసిన ఆటగాడిగా అవతరించడానికి కోహ్లీకి మరో నాలుగు 50 ప్లస్ స్కోర్లు మాత్రమే అవసరం. ప్రస్తుతం అతడు 63.. 50ప్లస్ స్కోర్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ (66 స్కోర్‌లు) చేశాడు.
Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
IPL ఫీట్ కోసం 28 సిక్సర్లు:
IPLలో 300 సిక్సర్లకు చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 28 సిక్సర్లు అవసరం. అతడు ప్రస్తుతం 272 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మొదటి ప్లేస్‌లో క్రిస్ గేల్ (357 సిక్సర్లుతో) ఉన్నాడు. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (280 సిక్సర్లతో) రెండవ స్థానంలో ఉన్నాడు.
(virat-kohli | ipl-2025 | latest-telugu-news | telugu-news)