IPL 2025 CSK VS RCB: 17 ఏళ్లలో చెన్నైపై ఒక్క మ్యాచ్ గెలవని RCB.. కానీ ఈ సారి!

ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఐపీఎల్‌లో బెంగళూరుపై సీఎస్కేకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఆర్సీబీ గత 17 ఏళ్లలో అంటే 2008 నుంచి CSKపై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది.

New Update
CSK VS RCB

CSK VS RCB

IPL 2025 CSK VS RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ CSK VS RCB మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ జట్టు ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. పిల్ సాల్ట్, దేవ్‌దత్‌ పడిక్కల్‌, కోహ్లీ (31) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్‌లో రజత్ పటీదార్‌, లైమ్‌ లివింగ్‌ స్టోన్‌ ఉన్నారు. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

CSKకు తిరుగులేని రికార్డు

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సీజన్‌లో సీఎస్కే, ఆర్సీబీ జట్లు చెరో మ్యాచ్‌ ఆడి విజయం సాధించాయి. కోల్‌కతాను ఓడించి బెంగళూరు ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌ను ఓడించి చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా IPLలో  RCBపై CSK జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ టీంల మధ్య ఇప్పటివరకు దాదాపు 33 మ్యాచ్‌లు జరిగాయి. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

అందులో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 21 మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. ఇక RCB జట్టు కేవలం 11 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. వీటిలో 1 మ్యాచ్‌లో రిజల్ట్ తేలలేదు. ఇక మరో విశేషం ఏంటంటే.. చెన్నైలో RCB గత 17 ఏళ్లలో అంటే 2008 నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

ఎప్పుడో IPL ఆరంభ సీజన్‌లో తప్ప.. ఆ తర్వాత జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టే గెలుపొందింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మెదులుతుంది. కొందరేమో ఆర్సీబీ గెలుస్తుంది అని అంటుంటే.. మరికొందరు సీఎస్‌కే ఘన విజయం సాధిస్తుందని అభిప్రయపడుతున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. 

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

(csk-vs-rcb | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు