/rtv/media/media_files/2025/04/09/SL4JiJ3bTJPojdRbkahQ.jpg)
RR vs GT
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్‌ఆర్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి స్థానంలో ఫజల్‌హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గుజరాత్ టీమ్ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది.
ఈ సీజన్‌లో గుజరాత్ మొదటి మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొదటి రెండు మ్యాచుల్లో ఓడి.. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఏడో స్థానంలో ఉంది.
Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
రాజస్థాన్ రాయల్స్ టీమ్
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్‌కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
Also Read: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి
గుజరాత్ టీమ్
సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ