IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

ముంబయి ఇండియన్స్‌ మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ తన డ్రీమ్ కెప్టెన్ అని అన్నాడు. అతడి కెప్టెన్సీలో ఒక్కసారైనా ఆడటం తన కలని పేర్కొన్నాడు. అదే తన కోరిక అని కూడా తెలిపాడు.

New Update
Batter Shashank Singh names Rohit Sharma as his dream IPL captain

Batter Shashank Singh names Rohit Sharma as his dream IPL captain

ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. దీని కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ముంబైకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మపై ఓ క్రికెటర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ తాజాగా రోహిత్ కెప్టెన్సీని కొనియాడాడు.

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

రోహిత్ నా డ్రీమ్ కెప్టెన్

రోహిత్ శర్మ తన డ్రీమ్ కెప్టెన్ అని అన్నాడు. అంతేకాకుండా రోహిత్ కెప్టెన్సీలో ఒక్కసారైనా ఆడటం తన కల అని శశాంక్ చెప్పుకొచ్చాడు. తన టీంలోని ఆటగాళ్లు నిరూపించుకోవడానికి మద్దతుగా రోహిత్ శర్మ  నిలుస్తాడని.. ముఖ్యంగా వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడని ప్రతి ఒక్కరూ చెప్పడం తాను విన్నట్లు తెలిపాడు. రోహిత్ శర్మ చాలా తెలివైన కెప్టెన్ అని కొనియాడాడు. అంతేకాకుండా తన టీం సభ్యులతో అతడు చాలా సరదాగా కూడా ఉంటాడని పేర్కొన్నాడు. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

అయితే ఎవరైనా తనను.. నువ్ ఎవరి కెప్టెన్సీలో ఆడాలనుకుంటున్నావ్ అడిగితే.. నేరుగా రోహిత్‌ శర్మ పేరు చెబుతానని అన్నాడు. అతనితో కలిసి ఒకసారి బ్యాటింగ్‌ కూడా చేశానని.. కానీ రోహిత్ అప్పటికి కెప్టెన్‌ కాదని పేర్కొన్నాడు. అందువల్ల రోహిత్ సారథ్యంలో ఆడాలనుకుంటున్నాను అని తన మనసులో మాట బయటపెట్టేశాడు. అదే తన కోరిక అని కూడా శశాంక్ సింగ్ తెలిపాడు.

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

ఇదిలా ఉంటే శశాంక్ సింగ్  గత సీజన్‌లో అదరగొట్టేశాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే ఈ బ్యాటర్ దుమ్ము దులిపేశాడు. దాదాపు 44.25 సగటు, 164.65 స్ట్రైక్‌రేట్‌తో 354 పరుగులు చేసి క్రికెట్ ప్రియుల్ని అలరించాడు. దీని కారణంగా ఈ ఏడాది అతడిని పంజాబ్ రూ.5.50 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు