/rtv/media/media_files/2025/03/25/bFzpKZ4XwZLVgEqj3Gpt.jpg)
Punjab Kings
అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులే చేసింది. సాయి సుదర్శన్ 74, బట్లర్ 54 పరుగులు చేశారు. చివర్లో రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో గుజరాత్ ప్లేయర్ తడబడ్డారు. చివరికి పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: ఏందీ సిరాజ్ అన్న.. రూ.12 కోట్లు బొక్క.. 54 పరుగులిచ్చి!
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 243 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. భారీ షాట్లతో స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 47 స్కోర్ చేశాడు. మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 5 (8), అజ్మతుల్లా ఒమర్జాయ్ 16 (15), స్టాయినిస్ 20 (15) పరుగులు చేశారు.
Also Read: శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం.. ఉతికారేసిన రూ. 5 కోట్ల ఆటగాడు!
gujarat-titans | punjab-kings | telugu-news | rtv-news