/rtv/media/media_files/2025/02/19/ohaGD4i7O657XBz0xpCG.jpg)
Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 60 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కీవీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు, టామ్ లేథమ్ 104 పరుగుల్లో 118 పరుగులు చేసి శతకాలతో విరుచుకుపడ్డారు. వీరి తర్వాత గ్లెన్ ఫిలిప్స్ కూడా 39 బంతుల్లో 61 పరుగులతో చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, హారిస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం
ఫెయిల్ అయిన బ్యాటర్లు...
దీని తర్వాత 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలైట్ అయింది. పాక్ బ్యాటర్లలో ఖుష్ దిల్ 49 బంతుల్లో 69, బాబర్ ఆజామ్ 90 బంతుల్లో 64, సల్మాన్ ఆఘా 28 బంతుల్లో 42 పరుగులు చేశారు. మిగతా వారందరూ సింగిల్ డిజిట్లకే అవుట్ అయి మ్యాచ్ ఓటమికి కారణమయ్యారు. కివీస్ బౌలర్లలో విలియం ఓరోర్క్ 3, మిచెల్ శాంట్నర్ 3, మ్యాట్ హెన్రీ 2, మైఖేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు. ఓవరాల్ గా న్యూజిలాండ్ ఆల్ రౌండ్ ఫెర్ఫామెన్స్ చేసింది. బ్యాటర్లు, బౌలర్లు సంయుక్తంగా రాణించి మొదటి మ్యాచ్ లో విజయం సొంతం చేసుకున్నారు.
Also Read: Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం