/rtv/media/media_files/2025/04/06/WHGnYvIE0HUu1qGo7fIg.jpg)
Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI
పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా వార్తల్లో నిలిచాడు. అతడు తన అనుచిత ప్రవర్తన ద్వారా విమర్శలకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లడంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఏం జరిగింది?.. ఎందుకు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లాడు? అనే విషయానికొస్తే..
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మొదటిగా రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్ శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలో సైతం కుప్పకూలిపోయింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్ 43 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో పాక్ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
దానికి తోడు ఇటీవలే టీ20 సిరీస్‌ను సైతం పాకిస్థాన్ కోల్పోయింది. 1-4 తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాక్ క్రికెటర్లు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ క్రికెటర్ ఖుష్దిల్ షా అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది.
A fan beating Pakistani cricketer Khushdil Shah in New Zealand. pic.twitter.com/pCnccxmZh0
— 𝐀𝐭𝐞𝐞𝐪 𝐀𝐛𝐛𝐚𝐬𝐢 (@AbbasiAteeq20) April 5, 2025
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ప్రేక్షకులపై దాడికి యత్నం
ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఖుష్దిల్ షా క్రికెట్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. అందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రియులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దానిని ఆపమని ఖుష్దిల్ షా వారిని కోరినా.. వారు దుర్భాషలాడుతూనే ఉండటంతో అతడు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే సిరీస్ టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాక్.. ఇప్పుడు వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో విలవిల్లాడిపోయిందని అందుకే ఖుష్దిల్ క్రూరంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Khushdil Shah fights with angry Pakistan fans and PCB, their media shamelessly puts blame on Afghanistanis. Earlier in USA, Haris Rauf had a fight with angry Pakistani fan but put blame calling that fan as an Indian. Pakistan Army disowns their soldiers dead bodies and Pakistan… pic.twitter.com/zLu4o3OJLC
— Tony Soprano (@Tony_Soprano21) April 5, 2025
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
పీసీబీ స్పందన
దీనిపై పీసీబీ స్పందించింది. ‘‘జాతీయ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు" అని పిసిబి తెలిపింది.
Pakistani Cricketer Khushdil Shah violently confronts Pakistani fans taunting Pakistani cricket team after Pakistan lost to Newzealand in the third ODI.
— Amitabh Chaudhary (@MithilaWaala) April 5, 2025
Situation further escalated and Khushdil and other Pakistani players were thrashed by the Afghanistan cricket fans present… pic.twitter.com/a7jBbkuG4C
(latest-telugu-news | telugu-news | pcb | Khushdil Shah | NZ vs Pak)