/rtv/media/media_files/2025/01/18/qEeDxHYUaFS2dhewfgxG.jpg)
nitish kumar reddy
2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ కీలక టోర్నమెంట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ ట్రోఫీలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. నితీష్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నప్పటికీ బీసీసీఐ అతన్ని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఐపీఎల్ 2024 లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇండియా తరఫున వన్డే, టీ20, టెస్ట్.. ఇలా అన్ని సిరీస్‌లలో పాల్గోన్నాడు.
Also Read : పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు
Also Read : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో తన ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. ఒకానొక సమయంలో సీనియర్లు ఫెయిల్ అయిన చోట సత్తా చాటాడు. దీంతో నితీష్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ జట్టులో అతనికి స్థానం దక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకులోనవుతున్నారు.
మరోవైపు ఈ ట్రోఫీలో వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్, KL రాహుల్ లాంటి ప్లేయర్స్ కు చోటు కల్పించి.. ఫుల్ ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి ఛాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో సెలక్టర్ల నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులతో పాటు పలువురు విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జట్టు ఇదే!
Also Read : టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్.. ఎవరతను?
ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.