/rtv/media/media_files/2025/03/05/fwBIBmqgeIBtIn0dCbSx.jpg)
New Zeland Vs South Africa
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరింది. మరో బలమైన ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికాను సెమీ ఫైనల్స్ లో మట్టికరిపించిన న్యూజిలాండ్ ఫైనల్స్ లో భారత్ తో పోటీకి సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 363 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సఫారీలకు ఇచ్చింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా ఫెయిల్ అయింది. బౌలర్ రబాడ కూడా హాప్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. మామూలుగానే పాకిస్తాన్ లోని లాహోర్ స్టేడియం పరుగుల వరద పారిస్తుంది. ఇక్కడ హైయ్యెస్ట్ స్కోరు ఎప్పుడూ 320కు పైనే ఉంది. అలాంటి పిచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. ఏకంగా 363 పరుగులు చేసి భారీ టార్గెట్ ను దక్షిణాఫ్రికాకు ఇచ్చారు. చివరి 5 ఓవర్లలోనే కీవీస్ జట్టు 66 పరుగులు చేసింది.
ఇద్దరు సెంచరీలు..
కీవీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్స్ 102, రచిన్ రవీంద్ర 108 పరుగులతో ఇద్దరూ శతకాలు చేశారు. ఈరోజు ఇన్నింగ్స్లో కీవీస్ బ్యాటర్లు ఎక్కువ వికెట్లు కోల్పోకుండానే భారీ స్కోరును సాధించగలిగారు. ఒపెనర్ గా వచ్చిన విల్ యంగ్ ఒక్కడే తొందరగా అవుట్ అయిపోయాడు. అతనితో పాటూ ఓపెనింగ్ కు దిగిన రచిన్ రవీంద్ర, తరువాత వచ్చిన కేన్ విలియమ్స్ లు క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు బ్యాటర్లు కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత వచ్చిన డారెల్ మిచెల్ కూడా బాగా ఆడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మిచెల్ 49 పరుగులు చేశాడు. ఇతని తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కూడా 44 పరుగులు చేశాడు. ఇలా మొత్తానికి 363 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఎక్కువ స్కోరును నమోదు చేశారు న్యూజిలాండ్ బ్యాటర్లు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మొదట నిలకడగా ఆడారు. అయితే తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేయగలిగారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 50, రస్సీ, వాన్ డర్ డస్సెన్ 69, బవుమా 56 లతో అర్ధసెంచరీలు చేశారు.