/rtv/media/media_files/2025/02/09/CW9aJ1ePzI24uE2d8Qmd.jpg)
nz vs pak
న్యూజిలాండ్ టీమ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రచిన్ రవీంద్ర తీవ్ర గాయపడ్డాడు. స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 38వ ఓవర్ లో వేసిన మూడో బంతిని పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్ షా స్లాగ్-స్వీప్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రాచిన్ క్యాచ్ కోసం ప్రయత్నించగా.. నేరుగా బంతి అతని నుదిటికి తాకింది. దీంతో అతను అక్కడే పడిపోగా తీవ్ర రక్త స్రావం జరిగింది. ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడం వలన ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
Get well soon, Rachin Ravindra 🤞
— Johns. (@CricCrazyJohns) February 8, 2025
- Scary scenes at Lahore for all cricket fans. pic.twitter.com/uERdaUuWHb
వెంటనే అక్కడికి చేరుకున్న ఫిజియోలు కర్చీఫ్ సాయంతో రక్త స్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవీంద్ర గాయాన్ని చూసి అభిమానులు షాకయ్యారు. ఏమైందో తెలియక కంగారు పడ్దారు. గతంలో ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు చోటుచేసుకున్న ఘటనను గుర్తుచేసుకున్నారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకుని ఊపిరి పిల్చుకున్నారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడటం ఆ జట్టుకు నిజంగా కోలుకోని దెబ్బే అని చెప్పాలి.
78 పరుగుల తేడాతో విజయం
ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు సాధించింది. ఫిలిప్స్ 74 బంతుల్లో 106 నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో ఏడు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. అనంతరం సాంట్నర్ 41 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
Also Read : కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఏక్‌నాథ్ షిండేగా మారనున్న సీఎం భగవంత్ మాన్!