/rtv/media/media_files/2025/04/01/V3d6kNqDJ1CnxoyAf4Ba.jpg)
Mumbai Indians
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ముంబై మూడు మ్యాచ్ లు ఆడింది. అందులో రెండు ఓడిపోయింది. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం గెలిచింది. 8 వికెట్ల తేడాతో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ను ముంబయ్ 116 పరుగులకే కట్టడి చేయడంతోనే మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేతుల్లోకి వచ్చినట్టుయింది. దాని తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబై బ్యాటర్లు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది.
ఐపీఎల్ లో ముంబై కొత్త రికార్డ్..
కేకేఆర్ మీద ముంబై ఈ మ్యాచ్ గెలవడమే కాకుండా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఒకే వేదికలో ఒకే జట్టు మీద 10 విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్..కోలకత్తా నైట్ రైడర్స్ మీద పదిసార్లు గెలిచింది. దీని కంటే ముందు కోల్‌కతా జట్టు ఈడెన్ గార్డెన్ వేదికగా పంజాబ్‌పై అత్యధికంగా 9 విజయాలు నమోదు చేసింది. ఈ రికార్డ్ ను ఇప్పుడు ముంబై క్రాస్ చేసింది. ఈ రెండింటి తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది. ఉప్పల్ లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద 8 సార్లు గెలిచింది.
ఇక ఐపీఎల్ లో మొత్తంగా ఇప్పటి వరకు ముంబై, కోలకత్తా పై 24 మ్యాచ్ లలో గెలిచింది. కేకేఆర్‌పై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టు ఇదే. దీని తరువాత ఈ జట్టు చెన్నైపై 20 మ్యాచ్ లు గెలిచింది. ఆర్సీబీపై చెన్నై 21 మ్యాచ్‌ల్లో గెలవగా, పంజాబ్‌పై కోల్‌కతా 21 మ్యాచ్‌ల్లో గెలిచింది.
today-latest-news-in-telugu | IPL 2025 | mumbai-indians
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!