/rtv/media/media_files/2025/03/28/PLWH8bvnjnvVPnnhuIus.jpg)
MS Dhoni magic stumping dismissed Phil Salt off Noor Ahmed
Dhoni Stumping: ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. చెన్నై VS బెంగళూరు జట్ల మధ్య తగ్గాపోరు మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెల్లి మెల్లిగా ఆడుతోంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, సాల్ట్ పరుగులు వర్షం కురిపించారు. మొదటి నుంచే సాల్ట్ దూకుడు మొదలు పెట్టాడు. ఫోర్లు, సిక్స్‌లు రాబడుతూ హోరెత్తించాడు.
Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య
Fastest Hands ⚡️@msdhoni pic.twitter.com/9NBOHxdzrL
— DHONI GIFS™ (@DhoniGifs) March 28, 2025
మెరుపు స్టంపింగ్
దీంతో ఆర్సీబీ జట్టు కేవలం 4 ఓవర్లలో 37/0 స్కోర్ రాబట్టింది. ఇక దూకుడుగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ ఒక్కసారిగా ఔటై పెవిలియన్‌కు చేరాడు. అతడి దూకుడు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. రెప్పపాటులో ధోనీ అద్భుత స్టంపింగ్ చేయడంతో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న సాల్ట్ (32)ను ధోనీ తన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్ బాటపట్టించాడు. కళ్లు తెరిచి మూసేంతలోపే ధోనీ వికెట్లను గిరాటేశాడు. కాగా ఇటీవల ముంబయితో జరిగిన గత మ్యాచ్‌లోనూ ధోనీ ఇలాగే చేశాడు. అత్యంత వేగంగా స్టంపింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
🚄: I am fast
— Star Sports (@StarSportsIndia) March 23, 2025
✈: I am faster
MSD: Hold my gloves 😎
Nostalgia alert as a young #MSDhoni flashes the bails off to send #SuryakumarYadav packing!
FACT: MSD affected the stumping in 0.12 secs! 😮💨
Watch LIVE action: https://t.co/uN7zJIUsn1 #IPLonJioStar 👉 #CSKvMI, LIVE NOW on… pic.twitter.com/oRzRt3XUvC
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
(sports-news | latest-telugu-news | telugu-news | csk-vs-rcb)