FIDE పదవికి ఆనంద్‌ అనర్హుడు: కార్ల్‌సన్

భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌పై ప్రపంచ చెస్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఫిడె పదవికి ఆనంద్ అనర్హుడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

New Update
Magnus Carlson

Magnus Carlson Photograph: (Magnus Carlson)

 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ప్రపంచ చెస్ నంబర్‌వన్ ఆటగాడునిబంధనలకు విరుద్ధంగా జీన్స్ ధరించిన విషయం తెలిసిందే. దీని వల్ల ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ నుంచి ఫిడె తప్పించింది. అయితే జీన్స్‌ వేసుకున్నందుకు కార్ల్‌సన్‌కి 200 అమెరికన్‌ డాలర్ల జరిమానా కూడా విధించారు. అయితే ఈ విషయంలో ఫిడె నిబంధనలను సడలించింది.

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

పదవికి అనర్హుడని

మాగ్నస్ కార్ల్‌సెన్ మళ్లీ ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌కు తిరిగి వెళ్లాడు. అయితే భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు, ఫిడె ఉపాధ్యక్షుడు అయిన విశ్వనాథన్‌ ఆనంద్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. విశ్వనాథన్ ఆనంద్ ఫిడె పదవికి అనర్హుడని కార్ల్‌సన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

ఫిడె నిబంధనలకు విరుద్ధంగా కార్ల్‌సన్ జీన్స్‌ వేసుకున్నందుకు అనర్హతకు గురైన సందర్భంలో ఆనంద్‌ ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. ఫిడె ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని కార్ల్‌సన్ అన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

కానీ ఫిడె అధ్యక్షుడు ఆర్కాడేతో మాట్లాడేంత వరకు కూడా ఉండాలని కార్ల్‌సన్ తండ్రి ఆపారని కార్ల్‌‌సన్ వెల్లడించాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల కార్ల్‌సన్‌కి జరిమానా విధించారు. రూల్స్ అనేవి అందరికీ ఒకటే. దీనికి ఆనంద్‌పై కార్ల్‌సన్ విమర్శించడం సరికాదని కొందరు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు