/rtv/media/media_files/2025/04/03/SGdX63EuB6XDEtyyCAAK.jpg)
Kolkata Knight riders
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రఘువంశీ 50, రహానే 38, వెంకటేశ్ అయ్యార్ 60, రింకూ సింగ్ 32 పరుగులతో అదరగొట్టారు. డికాక్ 1, నరైన్ 7 పరుగులు చేసి నిరాశపరిచారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందో మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. మొదటగా టాస్ గెలిచిన SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
Also Read: మరో వివాదంలో షమీ. ప్రభుత్వ నిధులు మింగేసిన సోదరి!
హర్షల్‌పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లున్నాయి. కేవలం 25 బంతుల్లోనే ఇతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిమర్జీత్ సింగ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్లో రింకూ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. ఆ తర్వాత సిమర్‌జిత్ బౌలింగ్‌లో అయ్యర్ లాంగాఫ్, లాంగాన్‌లో బౌండరీలు కొట్టగా కోల్‌కతా స్కోర్ 150కి చేరింది. ఆఖరి బంతిని రింకూ తనదైన స్టైల్లో ఆడాడు. మొత్తానికి కేకేఆర్ 201 పరుగులు భారీ లక్ష్యాన్ని SRH ముందు పెట్టింది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 3, 2025
With a scintillating final flourish, #KKR rocket to 2⃣0⃣0⃣ / 6⃣ after 20 overs 🔥
Stay tuned for #SRH's chase ⌛
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/O8hEFE7BGV