/rtv/media/media_files/2025/03/22/d0eWBD8FPosxV2BvCbuX.jpg)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా టీమ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన క్వింటన్ డికాక్(4) పరుగులకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ ప్లాప్
దీంతో ఆ తరువాత సునీల్ నరైన్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు కెప్టెన్ అజింక్య రహానే. మూడు ఓవర్లకు 9 పరుగులు చేసిన కేకేఆర్ టీమ్ ఆ తరువాత ఆరు ఓవర్లలో ఏకంగా 90 పరుగులు బాదింది. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 25 బంతుల్లో రహానే హాఫ్ సెంచరీ చేశాడు. పది ఓవర్లు పూర్తి అయ్యేసరికి కేకేఆర్ 100 పరగులు మార్క్ దాటింది. దీంతో స్కోరు 200పైగాపనే వెళ్తుందని అంతా భావించారు. ఇంతలోనే ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లతో కేకేఆర్ వికెట్ల పతనాన్ని శాసించారు. రహానే, సునీల్ నరైన్ అందించిన జోష్ ను మిడిలార్డర్ ఆటగాళ్లు కొనసాగించలేకపోయారు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ లాంటి హిట్టర్స్ కూడా త్వరత్వరగానే ఔటయ్యారు. లేదంటే కేకేఆర్ భారీ స్కోర్ చేసేదనే చెప్పాలి.
KKR in first 10 overs - 107/2.
— Akr_Cric (@Akr_cric) March 22, 2025
KKR in next 10 overs - 67/6.
TERRIFIC COMEBACK BY RCB BOWLERS IN THE OPENING MATCH👏#IPLUpdate #ipl2025 #KKRvRCB #RCBVKKR pic.twitter.com/Pgbl2dox5A
రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన సునీల్ నరైన్, అజింక్య రహానే జోడీని రసిఖ్ సలామ్ విడదీశాడు. 44 పరుగుల వద్ద సునీల్ నరైన్ వికెట్ కీపర్ జితీశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అ కాసేపటికే 56 పరుగుల వద్ద కృనాల్ పాండ్య బౌలింగ్‌లో రసిఖ్ సలామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మిడాల్డర్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. వెంకటేశ్ అయ్యర్ (6), రింకు సింగ్ (12), ఆండ్రీ రస్సెల్ (4), హర్షిత్ రాణా (5) ఔటయ్యారు. చివర్లో రఘువంశీ (30) దూకుడుగా ఆడటంతో కేకేఆర్ ఈ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, హాజిల్‌వుడ్ 2, యష్ దయాళ్, సలాం, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు.
Also read : Ajinkya Rahane : హాట్సాఫ్ రహానే.. అవమానించినోళ్ల నోళ్లు మూయించాడు!