/rtv/media/media_files/2025/03/21/MvwabjIUdRxzrIhv5WLV.jpg)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్ లకు స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రెగ్నెంట్ ... వచ్చేవారంలో ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో రాహుల్ ఆమె వెంట ఉండనున్నాడు. దీంతో రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండకపోవచ్చునని సమాచారం.
Also read : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
Also read : IPL 2025 : ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?
KL RAHUL set to miss first couple of matches #IPL2025 pic.twitter.com/HS7vQJbUU7
— Sanskar Gupta (@Sanskar7701) March 20, 2025
రూ.14 కోట్లకు కొనుగోలు
మిచెల్ స్టార్క్ భార్య, ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్ ఛానల్ లిఎస్‌టిఎన్‌ఆర్ స్పోర్ట్‌తో ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ హీలీ ఈ వార్తను వెల్లడించాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడిన రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను మాత్రం ఢిల్లీ వదులుకోగా లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో పంత్ మోస్ట్ కాస్ట్ లీ ప్లేయర్. ఇక పంత్ స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 24న సీజన్ తొలి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి.
Also Read : ప్రభాస్, దేవరకొండ, సమంత సూసైడ్ పక్కా.. వేణు స్వామి సంచలన ఆడియో లీక్!
Also read : తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట.. కీలక ఆదేశాలు!