ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుక్రవారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేశారు. మను భాకర్, చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీ టీం కెెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ విజేత ప్రవీణ్‌ కుమార్‌‌లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారు.

New Update
khail ratna

khail ratna Photograph: (khail ratna)

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుక్రవారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈఏడాది క్రీడారంగంలో అద్భుత ప్రతిభ చాటిన నలుగురికి ఖేల్ రత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌ గేమ్స్‌లో రెండు మెడల్స్ సాధించిన మనూ భాకర్, అతిచిన్న వరల్డ్ చెస్ ఛాపింయన్‌గా నిలిచిన గుకేష్‌లను ఈ అవార్డ్ వరించింది. వారితోపాటు హాకీ టీం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ప్రవీణ్‌ కుమార్‌‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్‌కు ఎంపికైయ్యారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. అంతే కాకుండా మరో 32 మందకి అర్జున్ అవార్డ్ కూడా ఇచ్చారు.

గుకేశ్‌ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ అయి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్‌ గత నెలలో చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్ లిరెన్‌ను ఓడించి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. హర్మన్‌ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌. హర్మన్‌ సారథ్యంలో భారత్‌ గతేడాది ఒలింపిక్స్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్‌ పతకం సాధించడంలో హర్మన్‌ కీలకపాత్ర పోషించాడు.

మ‌నూ భాక‌ర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్‌ గ‌తేడాది ఆగ‌స్టులో జ‌రిగిన విశ్వక్రీడ‌ల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్‌, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్ల‌లో) గెలుచుకుంది. ప్రవీణ్‌ కుమార్‌.. గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

ఇది కూడా చదవండి :  సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసిన క్రికెటర్ నితీష్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు