/rtv/media/media_files/2025/03/23/d9IIk6a2hdABK6geor5q.jpg)
IPL Stocks Photograph: (IPL Stocks)
ఐపీఎల్ సమయంలో కొన్ని రకాల స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లను క్రికెట్ ప్రేమికులు ఎక్కువగా చూస్తుంటారు. మ్యాచ్ వస్తుందంటే ఇక టీవీల దగ్గరే ఉంటారు. అయితే ఈ సమయంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, క్విక్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ వ్యాపారాల్లో లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
ట్రావెలింగ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే..
ఎందుకంటే క్రికెట్ ప్రేమికులు మ్యాచ్‌లు వీక్షించడానికి పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడ ఉండటం, ఫుడ్ తినడం వంటివి చేస్తుంటారు. దీంతో హాటల్స్, ఫుడ్ డెలివరీ సంస్థల వ్యాపారం పెరుగుతుంది. వీటితో పాటు ట్రావెలింగ్ స్టాక్స్ కూడా బాగా లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
ఐసీసీ ప్రపంచ కప్‌ను ఎలా అంతర్జాతీయగా వీక్షిస్తారో.. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా అలానే వీక్షిస్తారు. ఒక్కో జట్టులో కనీసం ముగ్గురు అయినా విదేశీ ఆటగాళ్లు ఉంటారు. వీరి వల్ల ఇతర దేశాల్లో కూడా మ్యాచ్‌లు చూస్తారు. దీంతో అక్కడి వారు ఇక్కడికి రావడం, వీసా ట్రాకింగ్ కంపెనీలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. దీంతో మీరు ఈ ఐపీఎల్ సమయంలో జొమాటో, స్విగ్గీ, హోటళ్లు వంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?
ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం