ఐపీఎల్‌ మెగావేలం.. ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఫుల్‌ లిస్ట్‌

ఐపీఎల్‌ 2025 మెగా వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో టీమ్‌ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఎవరెవరు ఏ టీమ్‌కు వెళ్లారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
IPL Auction

ఐపీఎల్‌ 2025 మెగా వేళం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇంత మొత్తంలో ఒక ప్లేయర్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యార్‌ను పంజాబ్‌ కింగ్స్‌.. రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే టీమిండియా పేస్ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని రూ.23.75 కోట్లకు తీసుకుంది. ఇక మరో పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది.  

ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే 

రిషభ్‌ పంత్ (రూ.27 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్ 
శ్రేయస్ అయ్యర్(రూ.26.75 కోట్లు) - పంజాబ్ కింగ్స్
వెంకటేశ్‌ అయ్యర్‌(రూ.23.75 కోట్లు) - కోల్‌కతా నైట్‌రైడర్స్‌  
అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) - పంజాబ్ కింగ్స్
యుజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు) - పంజాబ్ కింగ్స్ 
 జోస్ బట్లర్ (రూ.15.75 కోట్లు) - గుజరాత్ టైటాన్స్ 
కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు) - గుజరాత్ టైటాన్స్ 
మిచెల్ స్టార్క్ ( రూ.11.75 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
మార్కస్‌ స్టాయినిస్‌ (రూ.11 కోట్లు) - పంజాబ్‌
కగిసో రబాడ (రూ. 10.75 కోట్లు) -  గుజరాత్ టైటాన్స్  
మహ్మద్ షమి (రూ. 10 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్  
రవిచంద్రన్‌ అశ్విన్‌ (రూ.9.75 కోట్లు) - చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
జేక్ ఫ్రేజర్‌ రూ.9 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్‌ 
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
హర్షల్ పటేల్‌ (రూ.8 కోట్లు) - సన్‌రైజర్స్‌ హైదరాబాద్
డేవిడ్ మిల్లర్ (రూ.7.5 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్ 
హ్యారీ బ్రూక్‌ ( రూ.6.25 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్‌
డేవాన్ కాన్వే ( రూ.6.25 కోట్లు) - చెన్నై సూపర్‌ కింగ్స్‌  
మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) - పంజాబ్‌
రచిన్‌ రవీంద్రన్‌ (రూ.4 కోట్లు) - చెన్నై సూపర్ కింగ్స్‌  
క్వింటన్‌ డికాక్‌ (రూ.3.60 కోట్లు) - కోల్‌కతా నైట్ రైడర్స్ 
రాహుల్ త్రిపాఠి (రూ.3.40 కోట్లు) - చెన్నై 
మిచెల్ మార్ష్‌ (రూ.3.40 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్
మార్‌క్రమ్‌ (రూ.2 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్

Also Read: సెంచరీ చేసిన విరాట్‌ కొహ్లీ..

ట్రెంట్ బౌల్ట్‌ (రూ.12.50 కోట్లు) - ముంబయి ఇండియన్స్
నటరాజన్‌ ( రూ.10.75 కోట్లు) -  ఢిల్లీ క్యాపిటల్స్‌  
జోఫ్రా ఆర్చర్ ( రూ.12.50 కోట్లు) - రాజస్థాన్ రాయల్స్‌  
అన్రిచ్‌ నోకియా ( రూ.6.50 కోట్లు) - కోల్‌కతా  
అవేశ్‌ ఖాన్‌ (రూ.9.75 కోట్లు) - లక్నో
ప్రసిద్ధ్‌ కృష్ణ ( రూ.9.50 కోట్లు) - గుజరాత్‌ టైటాన్స్‌  
మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) -  రాజస్థాన్‌  
రాహుల్ చాహర్‌ ( రూ.3.20 కోట్లు) - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 
ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్‌
హేజిల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) - బెంగళూరు 
జితేశ్‌ శర్మ (రూ.11 కోట్లు)- పంజాబ్‌ 
ఇషాన్‌ కిషన్‌ (రూ.11.25 కోట్లు) - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
ఫిల్ సాల్ట్‌ ( రూ.11.50 కోట్లు) - ఆర్సీబీ

రెహ్మనుల్లా గుర్బాజ్‌ (రూ.2 కోట్లు) - కోల్‌కతా 

Also Read: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్‌ పంత్‌..

Also Read: SRHకు పంత్‌, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే

Also Read: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. 

New Update
ipl

SRH VS MI

ముంబై బ్యాటర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను మట్టికరిపించారు. హైదరాబాద్ ఇచ్చిన 144 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో కొట్టి విజయం సాధించారు.  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోని వచ్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 70 పరుగులు చేసి వరుసగా రెండో అర్దసెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యతం వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్ గా కూడా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సూర్య కుమార్ యావ్ కూడా  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. రికెల్‌టన్ (11), విల్ జాక్స్ (22) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్‌ తీశారు. దీంతో ముంబై ఇంకా 26 బాల్స్ మిగిలుండానే హైదారబాద్ ను చిత్తు చేసింది.  దీంతో ముంబై వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లను గెలచి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

చేతులెత్తేసిన హైదరాబాద్..

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను కోల్పోతూ కనీసం వంద అయినా స్కోర్ చేస్తారా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-mi | match

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment