/rtv/media/media_files/2025/03/19/BpAZ3TVYozHKZp2GyAjh.jpg)
IPL Match rescheduled Photograph: (IPL Match rescheduled)
ఐపీఎల్ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరగనుంది. అయితే ఏప్రిల్ ఆరో తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ నిర్వహణకు సిటీ పోలీసు నుంచి ఎలాంటి పర్మిషన్ రాలేదు.
Security Scare in Kolkata | IPL Match to be Rescheduled?
— TIMES NOW (@TimesNow) March 19, 2025
- 'Not enough security deployment' cited
- IPL SOURCES: Got rescheduling request.@karishmasingh22 shares more details with @sagarikamitra26 pic.twitter.com/JFOwGSthGX
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
శ్రీరామ నవమి కావడంతో..
ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామ నవమి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో సుమారుగా 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు చేసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ నిర్వహణకు సిటీ పోలీసు నుంచి సెక్యూరిటీ రావడం కూడా కష్టమే. సిటీ పోలీసులతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపారు.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
కానీ అధికారులు మ్యాచ్ ఏర్పాటుకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని బెంగాల్ అసోసియేషన్ బీసీసీఐకి వెల్లడించారు. అయితే గతేడాది కూడా శ్రీరామనవమి రోజు మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. ఈ ఏడాది కూడా తప్పకుండా మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?