/rtv/media/media_files/2025/04/04/OhJumntzAzNz0y1GtlmC.jpg)
IPL 2025 Lucknow huge score against Mumbai
LSG vs MI:ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా నేడు ముంబై వర్సెస్ లక్ నవూ సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్ నవూ దండికొట్టింది. 20 ఓవరల్లో 203/8 పరుగులు చేయగా పవర్ ప్లే లో ఓపెనర్ మిచెల్ మార్ష్ విశ్వరూపం చూపించాడు. ఒక్కడే 60 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అయితే ఈ ఆసీస్ స్టార్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ మార్ష్ ను ఔట్ చేసే అవకాశాన్ని ముంబై చేజేతులా వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.
LSG have posted an excellent total on the board💪
— SBM Cricket (@Sbettingmarkets) April 4, 2025
Can MI chase it down?
📸: IPL/BCCI#MitchellMarsh #AidenMarkram #DavidMiller #AyushBadoni #HardikPandya #VigneshPuthur #LSGvsMI #LSGvMI #IPL2025 #TATAIPL #Cricket #SBM pic.twitter.com/xkC7Ckvg6o
27 బంతుల్లో హాఫ్ సెంచరీ..
ఈ మేరకు బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్ లో ఔట్ కావాల్సిన మార్ష్ కు ముంబై అనవసరంగా అవకాశం ఇచ్చింది. నాలుగో బంతి మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బ్యాట్ ఎడ్జ్ తాకినా ఎవరు అప్పిల్ చేయలేదు. అల్ట్రా ఎడ్జ్ లో బ్యాట్ స్పష్టంగా తగిలినట్టు చూపించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్.. బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మొత్తం 31బంతుల్లో 60 పరుగులు చేశాడు. చివరికి విగ్నేష్ పుత్తూరు బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తొలి ఓవరల్ ఔట్ అయితే నాలుగు పరుగులే చేసేవాడు. కానీ ముంబై నిర్లక్ష్యం కారణంగా మార్ష్ మరో 56 పరుగులు చేయాల్సివచ్చింది.
Comeback Mode 🔛
— IndianPremierLeague (@IPL) April 4, 2025
Vignesh Puthur and Hardik Pandya bring #MI back in the game after #LSG started strong.
LSG are 100/2 after 10 overs.
Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @mipaltan pic.twitter.com/DJLmeKnOVn
IPL 2025 | mumbai | lucknow | telugu-news