/rtv/media/media_files/2025/04/08/9JbjysZQYzzEwptp8aWY.jpg)
ipl 2025lsg vs kkr Photograph: (ipl 2025lsg vs kkr)
IPL 2025: IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
Storm & Calm! 🤜🏼🤛🏼 pic.twitter.com/k5bUs9NQNu
— KolkataKnightRiders (@KKRiders) April 8, 2025
తుది జట్లు..
KKR: అజింక్య రహానే (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, అండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్‌రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.
Our starting knights as we take the field first ⚔️ pic.twitter.com/kBB8Mrx4An
— KolkataKnightRiders (@KKRiders) April 8, 2025
LSG: రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కమ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠీ.
ఇక టాస్ అనంతరం ముందుగా బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. పిచ్ చాలా బాగుంది. బౌండరీ చిన్నగా ఉంది. అందుకే మేం మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఇక రిషబ్ పంత్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని చెప్పలేను. మేం గతం గురించి ఆలోచించడం లేదు. టీమ్‌గా మేం విజయం సాధిస్తున్నప్పుడు కెప్టెన్‌గా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు.