/rtv/media/media_files/2025/03/27/t7eWnrW9vbFrSdgWt3hq.jpg)
rr ipl Photograph: (rr ipl)
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. అతని సారథ్యంలో వరుసగా రెండు మ్యా్చ్ ల్లో రాజస్థాన్ ఘోర ఓటమి మూటగట్టుకోగా పరాగ్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ ను పరిస్థితికి తగ్గట్టు వాడుకోవడంలో విఫలమయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెస్టిండీస్ హిట్టర్ హెట్‌మయెర్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో చివరకు పంపించడంపై మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మండిపడ్డారు.
Know this hurts a bit, Royals fam. Same here. We’ll be back 💗 pic.twitter.com/BCfioDfeOv
— Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2025
8 స్థానంలో ఆడించడం దారుణం..
ఈ మేరకు 'షిమ్రోన్ హెట్‌మయెర్ ను రూ. 11 కోట్లు పెట్టి రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. అలాంటి విలువైన ఆటగాడిని 8 స్థానంలో ఆడించడం దారుణం. జట్టు ఓటమిలో ఇది ఒక బలమైన కారణమే. కరేబియన్ లీగ్‌లో అతను వన్‌డౌన్ లేదా సెకండ్ డౌన్‌లో ఆడతాడు. మరి రాజస్థాన్ ఎందుకు లాస్ట్ కు పంపిస్తోంది. గయానాలో అతడు 4 స్థానంలోపే బరిలోకి దిగేవాడు. ఐపీఎల్‌లో లోయర్ ఆర్డర్‌కు ఎందుకు పంపించారు. అతడు ఫినిషర్ అని అనుకుంటున్నారు కానీ ఇదొక చెత్త నిర్ణయం. హిట్టింగ్ మాత్రమే కాకుండా నిలకడగా పరుగులు చేయగలడు. ఇంపాక్ట్ సబ్‌ను పంపించకముందే హెట్‌మయెర్‌ను ఆడించండి' అని సూచించారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఇక మొదటి రెండు మ్యాచుల్లో రాజస్థాన్ ప్రణాళికలు అసలేం బాగోలేవని మండిపడ్డారు. విభిన్నమైన వ్యూహాలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కనీసం 5 లేదా 6వ స్థానంలో వచ్చినా అతను మరిన్ని పరుగులు చేసేవాడు. శుభ్‌మ్ దూబెను ఇంపాక్ట్‌గా అవసరం లేదని తన అభిప్రాయం వెల్లడించాడు. ఇక బుధవారం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక 17.3 ఓవరల్లలో 2 వికెట్టు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది కోల్ కతా.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
ipl-2025 | Rajastan Royals | riyan-parag | telugu-news | today telugu news