India Vs South Africa: సఫారీల పనిపట్టిన భారత బౌలర్లు..మొదటి టీ20లో గెలుపు

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. భారత బౌలర్లు ప్రొటీస్ ను వణికించారు. కేవలం 74 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

New Update
first t20

టెస్ట్, వన్డే సీరీస్ ల తర్వాత దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య టీ 20 సీరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న కటక్ లో మొదటి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించేశారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ సఫారీలకు చెమటలు పట్టించారు. కేవలం 74 పరుగులకే ఆ టీమ్ ను ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.  టీ20 సిరీస్‌ను భారీ విజయంతో మొదలుపెట్టింది. హోరాహోరీ ఖాయమనుకున్న తొలి టీ20లో సూర్యకుమార్‌ సేన ఏకంగా 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

బెంబేతెల్లించిన భారత బౌలర్లు..

వన్డే సీరీస్ లో గట్టి పోటీ ఇచ్చిన సఫారీ టీమ్ టీ 20 ల్లో మాత్రం చేతులెత్తేసింది. మరోవైపు భారతసేన ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమ్ ఇండియా అదరగొట్టింది. ముఖ్యంగా బౌలర్లు రెచ్చిపోయారు.అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/14), జస్‌ప్రీత్‌ బుమ్రా (2/17), వరుణ్‌ చక్రవర్తి (2/19), అక్షర్‌ పటేల్‌ (2/7)ల ధాటికి దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. డివాల్డ్‌ బ్రెవిస్‌ (22) టాప్‌స్కోరర్‌. భారత జట్టులో బౌలింగ్‌ చేసిన ఆరుగురికీ వికెట్‌ దక్కింది. నిజానికి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా చాలా కష్టం మీద 175 పరుగులు చేసింది. టీ20ల్లో అది చాలా తక్కువ స్కోరనే చెప్పాలి. వన్డేల్లో 350 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా కొట్టేసిన సౌత్ ఆఫ్రికా టీమ్ 175 పరుగులను కూడా ఇట్టే కొట్ట్తుంది అనుకున్నారు అంతా. కానీ భారత పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా భారత బౌలర్లందరూ కట్టుదిట్టంగా బంతులేయడంతో సఫారీ జట్టు కుదేలైంది. ఏ దశలోనే పోటీని ఇవ్వలేకపోయింది. తొలి ఓవర్లో మొదలైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఆ జట్టులో అత్యధిక భాగస్వామ్యం 24 పరుగులే అంటేనే అర్ధం అవుతోంది మన వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ చేశారో. వరుస ఓవర్లలో డికాక్‌ (0), స్టబ్స్‌ (14)లను ఔట్‌ చేసిన అర్ష్‌దీప్‌.. ఆరంభంలోనే దక్షిణాఫ్రికాను గట్టి దెబ్బ తీశాడు. తరువాత వచ్చిన బ్యాటర్లు పరుగులు తీయడానికి ప్రయత్నించారు కానీ మిగతా బౌలర్లు ఛాన్స్ ఇవ్వలేదు. 

అదరగొట్టిన హార్దిక్ పాండ్యా..

ఎప్పటిలానే ఈ మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. మొదట ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా లుగి ఎంగిడి శుభ మన్ గిల్ వికెట్ తీసి షాకిచ్చాడు. తాను ఎదుర్కొన్న మొదట బంతికే ఫోర్ బాదిన గిల్..తరువాత బంతికే అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన బ్యాటర్లతో పాటూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఎక్కువగా పరుగులు చేయలేకపోయారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే కాస్త పరుగులు సాధించగలిగాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో పాండ్యా 59 పరుగులు కొట్టి హాప్ సెంచరీ కొట్టాడు. ఇతని తర్వాత తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 33, అభిషేక్ శర్మ 17 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, లుథో సిపమ్లా 2, డొనావన్ ఫెరీరా ఒక వికెట్ పడగొట్టారు.  

Advertisment
తాజా కథనాలు