Champions Trophy: న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఈరోజు.. విజయపరంపర కొనసాగిస్తుందా..

ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లు రెండూ ఈరోజు మొదటిసారి తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా, న్యూజిలాండ్ లో ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలుపోటములును బట్టి సెమీస్ లో ఎవరితో ఆడతారో తేలుతుంది.

New Update
cric

India vs New Zealand

గ్రూప్ ఏ నుంచి రెండు జట్లు సెమీస్ కు అడుగుపెట్టాయి. రెండూ బలమైన జట్లే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇండియా, న్యూ జిలాండ్ టీమ్ లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ కు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య  మ్యాచ్  మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవనుంది. 

ఎవరు గెలుస్తారో..

భారత్ , న్యూజిలాండ్ రెండూ బలమైన జట్లే.  వరుస మ్యాచ్ లు గెలవడం వలన రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిస్తే టాప్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు గ్రూప్ బిలోని ఆస్ట్రేలియా జట్టుతో  ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా పెద్ద నష్టమేమీ లేదు. అలా కనుక జరిగితే టీమ్ ఇండియా సఫారీలతో ఆడుతుంది. అయితే ఇప్పటివరకు టోర్నీలో జరిగిన మ్యాచ్ లలో భారత్ స్పిన్ కు ఇబ్బంది పడింది. ఇప్పుడు న్యూజిలాండ్ మీద మ్యాచ్ తో ఆ లోపానని సరిదిద్దుకోవాలని అనుకుంటోంది. కీవీస్ కు బలమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. కివీస్‌ స్పిన్నర్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో క్షీణించిన పిచ్‌పై వాళ్లు మరింత ప్రభావం చూపవచ్చు. అలాగే మన బౌలర్లలో కూడా స్పిన్ విభాగం బలంగానే ఉంది. జడేజా, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌ల రూపంలో అయిదుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ప్రతీ మ్యాచ్ లో వీరు బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టారు కూడా. 

ఇక బ్యాటర్లు విషయానికి వస్తే న్యూజిలాండ్ లో విలియమ్సన్, విల్‌ యంగ్, లేథమ్, కాన్వే, రచిన్‌ రవీంద్ర చక్కటి ఫామ్‌లో ఉన్నారు. వీరిని భారత బౌలర్లు ఏమేర కట్టడి చేస్తారో చూడాలి. మరోవైపు మనవాళ్లు ఏమీ తక్కువ ఆడడం లేదు. గిల్, విరాట్ ముందు మ్యాచ్ లలో సెంచరీలు చేసి మంచి ఊపు మీద ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా కన్సెస్టింగ్ తో ఆడుతున్నారు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందులోనూ కోహ్లీకి ఇది 300వ వన్డే మ్యాచ్. దీనిలో అతను ఏం అద్భుతాలు చేస్తాడో చూడాలి మరి. 

మరోవైపు ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కు విశ్రాంతిని ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పాక్ మ్యాచ్ లో తొడకండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడు హిట్ మ్యాన్. ఒకవేళ అతనికి కనుక రెస్ట్ ఇస్తే పంత్ జట్టులోకి వస్తాడు. అలాగే షమి కూడా పిక్క నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతనికి కూడా విశ్రాంతిని ఇచ్చి అర్షదీప్ ను ఆడనిస్తారని అంటున్నారు. 

Also Read: Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ

Advertisment
Advertisment
Advertisment