Virat Kohli: అతడి వల్లే కోహ్లి ఔటయ్యాడు.. వారు కావాలనే అలా చేశారు: ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు!

రెండో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి 5 రన్స్ కే ఔటయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ చేసిన పనివల్లే కోహ్లి ఔటయ్యాడని అతడి ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. కోహ్లి ఔటయ్యే ముందు బాల్ ను బట్లర్ అతడిపైకి విసిరి ఏకగ్రత కోల్పోయేలా చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

New Update
virat kohli fans storm jos buttler social media

virat kohli fans storm jos buttler social media Photograph: (virat kohli fans storm jos buttler social media)

భారత్ - ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న రెండో వన్డే మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌ను కూడా టీమిండియా దక్కించుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ఇంగ్లండ్ విధించిన 305 పరుగులను అలవోకగా ఛేదించింది. ఈ విజయానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కృషి ఎంతో ఉందని చెప్పాలి. 

దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావడం.. సెంచరీ చేయడంతో కటక్ స్టేడియం దద్దరిల్లిపోయింది. 90 బంతుల్లో 119 పరుగులు చేసి రోహిత్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అయితే ఇప్పటి వరకు రోహిత్, విరాట్ ఫామ్‌లో లేరని చాలా మంది విమర్శలు, ట్రోలింగ్స్ చేశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నిన్న ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ ఫామ్ లోకి వచ్చేశాడు. 

Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

విరాట్ పేవల ఫామ్

కానీ విరాట్ మాత్రం తన పేవల ఫామ్ నే కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 5 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఐదు రన్స్ లో ఒక ఫోర్ కొట్టాడు. కానీ ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండలేకపోయాడు. అదిల్ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. అయితే ఈ ఔట్ ను మొదట అంపైర్ ఇవ్వలేదు.. కానీ ఇంగ్లండ్ డీఆర్ఎస్ కోరగా.. థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు. 

Also Read: Donkey Route: డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

కోహ్లీపై బాల్ విసరడంతో

ఇదంతా ఒకెత్తయితే.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔటయ్యే ముందు తన ఏకాగ్రతను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అభిమానులు సైతం చెబుతున్నారు. ఎందుకంటే.. అదిల్ రషీద్ వేసిన 20వ ఓవర్ 3వ బాల్ కి విరాట్ ఔటయ్యాడు. దీనికంటే ముందు వేసిన బాల్ ని విరాట్ డ్రైవ్ చేశాడు. అది నేరుగా జోస్ బట్లర్ వద్దకు వెళ్లగా.. అతడు తిరిగి వికెట్ కీపర్ వైపు విసిరాడు. కానీ ఆ బాల్ విరాట్ వైపు వచ్చింది.

Also Read: Bangladesh:బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

దీనిపై బట్లర్ కూడా కోహ్లీకి సారీ చెప్పినట్లు సైగలు చేశాడు. ఆ తర్వాత బంతికి విరాట్ ఔటయ్యాడు. ఇదే విషయాన్ని కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కోహ్లీపై కావాలనే ఆ బాల్ ని విసిరినట్లు ఉందని.. అతడి ఏకాగ్రతను కోల్పోయేలా చేయడంలో బట్లర్ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడని నెట్టింట కోహ్లీ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు