Kho Kho World Cup 2025: డబుల్ ధమాకా.. ఖోఖో రెండు ప్రపంచకప్‌లు మనవే!!

ఖోఖో వరల్డ్ కప్‌ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్‌లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం.

New Update
kho kho world cup

kho kho world cup Photograph: (kho kho world cup)

Kho Kho World Cup 2025: ఖోఖో వరల్డ్ కప్‌ టోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. 78-40తో గెలిచి తొలి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 

kho kho 2

అలాగే భారత పురుషుల టీమ్ సైతం ప్రపంచకప్ సొంతం చేసుకుంది. పురుషుల జట్టు 54-36తో నేపాల్‌ను ఓడించి తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

 

తొలి జట్టుగా భారత్ రికార్డు.. 

ఈ మేరకు ఖోఖో ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. కాగా తొలి ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా భారత్ నిలిచింది. మొదటినుంచి నేపాల్ పై ఆధిపత్యం చెలాయించిన మహిళల భారత టీమ్.. దూకుడుగా ఆడి 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.  

kho kho

  నేపాల్‌ పుంజుకోవడంతో 35-24తో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. కానీ మూడో టర్న్‌లో దూకుడు పెంచిన భారత్వరుసగా పాయింట్లు సాధించి 49కి చేరింది. చివరి టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు సాధించినప్పటికీ భారత్ 38 పాయింట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. 

kho kho 3

 

Advertisment
Advertisment
Advertisment