/rtv/media/media_files/2026/02/26/india-1-2026-02-26-20-52-35.jpg)
చెన్నైలోని చిదంబరం స్టేడియం(M A Chidambaram Stadium) వేదికగా టీమ్ఇండియా(team-india) జింబాబ్వే(zimbabwe) జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా అదగొట్టింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 55, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33, సంజు శాంసన్ 24, తిలక్ వర్మ 44*, హార్దిక్ పాండ్య 50* పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ఎంగరవ, ముజరబాని, మపోస, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం అని చెప్పాలి. భారత్ తమ ప్లేయింగ్ XIలో రెండు మార్పులు చేసింది. రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో సంజు శాంసన్, అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు.
Also Read : INDw vs AUSW : 214 పరుగులకు భారత్ ఆలౌట్ !
జట్లు((ind-vs-zim)
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమాని (WK), డియోన్ మైయర్స్, సికందర్ రజా (C), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజారబానీ
Also Read : మహ్మద్ షమీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు!
Follow Us