/rtv/media/media_files/2025/02/08/nVrtpfOSK1kIPc21hNmq.jpg)
india batting coach sitanshu kotak reveals virat kohli fitness
భారత్ - ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇటీవల తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 249 లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. అయితే అతి తక్కువ సమయంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో అంతా నిశ్శబ్దం అయిపోయారు.
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
మ్యాచ్ చేజారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ సిక్సర్లతో అందరిలోనూ ఊపొచ్చింది. అతడికి తోడుగా శుభమన్ గిల్ సైతం మరోవైపు సిక్సర్లు కొడుతుంటే అందరిలోనూ జోష్ పెరిగిపోయింది. ఇక హాఫ్ సెంచరీ తర్వాత శ్రేయస్ ఔటయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ క్రీజ్ లోకి వచ్చి తన సత్తా చూపించాడు. ఇలా ఈ ముగ్గురు టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
కటక్ వేదికగా రెండో వన్డే
ఇక రేపు అంటే ఆదివారం రెండో వన్డే మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పితో కోహ్లీ తొలి వన్డేకు దూరమవడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. అయితే ఇప్పుడు కోహ్లీ ఫిట్‌నెస్‌పై భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
విరాట్ ఫిట్‌నెస్ వివరాలు
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడని క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. అతడు ప్రాక్టీస్ కోసం వచ్చాడని.. బాగా సన్నద్ధమయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో క్రికెట్ ఫ్యాన్స్, విరాట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Sitanshu Kotak press conference
— Sports Express (@Xpress_Sports) February 8, 2025
Yes we lost early wickets and it happens but the way Gill, Shreyas and Axar batted, we were going at 9-10 rpo.
Kohli is fit, here to train and good to go pic.twitter.com/XLAXg2sR7W
ఎవరిని తప్పిస్తారు..
మరోవైపు కోహ్లీ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే తొలి వన్డేలో కోహ్లీ ప్లేస్‌లో శ్రేయస్ వచ్చి.. తన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి టీంకు మంచి బూస్ట్ ఇచ్చాడు. అందువల్ల రెండో వన్డేలో అతడిని తప్పించే పరిస్థితి లేనట్టు కనిపిస్తోంది. మరి తుది జట్టులో ఎవరిపై వేటు పడనుందో రేపు తేలనుంది.