/rtv/media/media_files/2026/03/10/icc-punishes-arshdeep-singh-days-after-t20-world-cup-final-2026-03-10-17-54-32.jpg)
ICC Punishes Arshdeep Singh Days After T20 World Cup Final
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ అతడిపై భారీ ఫైన్ విధించింది. ఆదివారం జరిగిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ వేసేటప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పై అర్ష్‌దీప్ బంతి విసిరిన సంగతి తెలిసిందే. ఇలా అనుచితంగా బాల్ విసిరినందుకు ఐసీసీ చర్యలకు దిగింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు ఫైన్‌తో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.
Also Read: గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!
అసలు ఏం జరిగింది ?
ఫైనల్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అర్ష్‌దీప్ 11వ ఓవర్‌లో బౌలింగ్ వేయగా.. డారిల్ మిచెల్ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. కాస్త అసహనం వ్యక్తం చేసిన అర్ష్‌దీప్.. మరో బాల్‌కు మిచెల్‌పై నేరుగా బాల్ విసిరాడు. దీంతో మిచెల్ కోపంతో ఊగిపోయాడు. ఏంటి అన్నట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ అర్ష్‌దీప్ మాత్రం అతడిని పట్టించుకోకుండా వెనక్కి వచ్చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్య వెళ్లి మిచెల్‌కు సర్దిచెప్పాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్‌కు అంపైర్ కూడా నచ్చజెప్పగా దీంతో అతడు సారీ అన్నట్లు సైగలు చేశాడు.
Indian pacer Arshdeep Singh fined 15% of match fee for a Level 1 ICC Code of Conduct breach during the T20 World Cup 2026 final vs New Zealand in Ahmedabad.
— The News Drill™ (@thenewsdrill) March 10, 2026
He also received one demerit point for throwing the ball dangerously toward Daryl Mitchell. pic.twitter.com/8j602BNCkrpic.twitter.com/722SQyFmz2
Also read: CBSC క్వశ్చన్ పేపర్‌పై QR కోడ్.. స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో వీడియో సాంగ్
మ్యూచ్ అయిపోయిన తర్వాత మిచెల్, అర్ష్‌దీప్ మాట్లాడుకున్న దృశ్యాలు కనిపించాయి. తాను మిచెల్‌కు సారీ చెప్పానని.. కావలని బంతిని అలా విసరేదని తెలిపినట్లు అర్ష్‌దీప్ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా టీ20 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Follow Us