ICC Champions Trophy 2025: భారత్‌పై కమిన్స్ కాంట్రవర్సీ కామెంట్స్.. క్రికెట్ ప్రపంచంలో దుమారం!

ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ఒకే వేదికపై ఆడటం బాగా కలిసొస్తుందంటూ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండియా, SRH ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను అలా అనలేదంటూ ప్యాట్ మరో పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ అవుతోంది. 

New Update
pat cummins

Pat Cummins Controversial Comments on India

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత టీమ్ పాకిస్థాన్ వెళ్లకపోవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా నిర్వహించడం భారత్‌కు బాగా కలిసొస్తుందన్నాడు. అంతేకాదు ఇండియా ఛాంపియన్ కప్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారం రేపుతున్నాయి. కమిన్స్ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. SRH అభిమానులు సైతం ప్యాట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ టోర్నీ ఆడకున్నా విషం చిమ్మడం మానలేదంటూ పొట్టుపొట్టు తిడుతున్నారు.   

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

భారత్ కే ప్రయోజనం..

ఈ మేరకు గాయంతో మెగాటోర్నీకి దూరమైన ఆసీస్ సారథి కమిన్స్‌ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఛాంపియన్ ట్రోఫీ గురించి మట్లాడుతూ ఇలా అన్నాడు. 'పాక్ వెళ్లేందుకు భారత్‌ నిరాకరించింది. దీంతో హైబ్రిడ్‌ పద్ధతిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతోంది. అయితే భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహించడం మంచిదే. కానీ ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడిన జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భారత్ టీమ్ ఇప్పటికే చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి దుబాయ్‌లోనే టోర్నీ మొత్తం ఆడటం కలిసొస్తుంది. కప్ కొట్టే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి' అంటూ చెప్పుకొచ్చాడు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

ఇదిలా ఉంటే.. కమిన్స్ కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ప్యాట్.. నిజంగా తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మీడియా ఛానల్ ప్రచురించిన వార్త వల్లే తప్పుడు సంకేతాలు వెళ్లాయని క్లారిటీ ఇచ్చాడు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు