Rohit Sharma: సచిన్‌ రికార్డులను బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్

ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్‌ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ఘనత సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్‌లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

New Update
Rohith Sharma record

Rohith Sharma record Photograph: (Rohith Sharma record)

టీమిండియా (Team India) కెప్టెన్‌, ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రోహిత్ శర్మ ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 90 బంతుల్లో 119 స్కోర్ చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అయితే మొత్తం మూడు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను దాటేశాడు.

ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

మొత్తం మూడు ఫార్మాట్‌లలో..

మూడు ఫార్మాట్‌లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఈ రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టే అవకాశం త్వరలో లేకపోకపోలేదు. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పకుండా ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment
Advertisment
Advertisment