/rtv/media/media_files/2025/03/20/OiEw3ow90zwcNHmwWD8l.jpg)
Rohith sharma with family
ఐపీఎల్ మొదలైతే క్రికెట్లు అందరూ రెండు నెలలు ఫుల్ బిజీ అయిపోయాతారు. వరుసగా మ్యాచ్ లు ఆడుతూ అటుఇటూ తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజుల క్రితమే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా ప్లేయర్లు పెద్ద గ్యాప్ లేకుండానే ఐపీఎల్ కు సిద్ధమవుతున్నారు. దీంతో మధ్యలో దొరికిన కాస్త సమయంలో చిల్ అవుతున్నారు. తాజాగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు. ఇక్కడ వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషి అనే లగ్జరీ రిసార్ట్‌లో రోహిత్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒక్క రోజుకు 23 లక్షలు..
రోహిత్ మాల్దీవుల్లోనే ఉన్న అత్యంత విలాసవంతమైన లగ్జరీ రిసార్ట్ లో స్టే చేశాడు. వాల్డోర్ఫ్ ఆస్టోరియా..మాల్దీవుల్లో అతి పెద్ద ఐలాడ్ లలో ఒకటి. ఇక్కడ ఎంతో విశాలవంతంగా, ప్రశాంత వాతవరణంలో రీఫ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లా, బీచ్ విల్లాలు ఉంటాయి. ఇందులో రీఫ్ విల్లాలో రోహిత్ సేదతీరాడని చెబుతున్నారు. దీని ఖరీదు ఒక్క రోజుకు 23 లక్షలని చెబుతున్నారు. ఇందులో అన్ని విలాసవంతమైన సౌకర్యాలుంటాయి. ఇదొక త్రీ బెడ్ రూం విల్లా. ఇందులోనే రోహిత్ సైకి్ రైడ్ చేస్తూ...అతని కూతురు వాటర్ పార్క్ లో ఆడుకుంటూన్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు రోహిత్.
ఈ టూర్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో జాయిన్ అవ్వనున్నాడు. టీమ్ తో కలిసి ప్రాక్టీస్ సెషనలో కూడా పాల్గొననున్నాడు. మార్చి 23న ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్ ను ఆడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వహించనున్నాడు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో సూర్య బాధ్యతలు తీసుకున్నాడు.
Also Read: AP: తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన
Rohit Sharma: నా క్యారెక్టర్ మారింది.. మైండ్‌సెట్ కాదు.. హిట్ మ్యాన్ సంచలన కామెంట్స్!
ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.
Rohit Sharma interesting comments on Mumbai Indians
Rohit Sharma: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ముంబైకి కెప్టెన్‌గా, మిడిలార్డర్, ఇప్పుడు ఓపెనర్ బ్యాటర్‌గా పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకున్నట్లు తెలిపాడు. అయితే తన పాత్రలు మారుతూ వస్తున్నాయి కానీ.. తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏం చేయాలో అదే చేస్తున్నా..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఇందులో ఏ మార్ప లేదు. మ్యాచ్ గెలవాలి. ట్రోఫీలు సొంతం చేసుకోవడంపైనే ఫోకస్ ఉంటుంది. ముంబై ఇండియన్స్‌కు ఇదంతా తెలుసు. కొన్నేళ్లుగా చాలా ట్రోఫీలను గెలుచుకున్నాం. విజేతలుగా నిలుస్తున్నాం. ముంబై ఇండియన్స్ కల్చర్ ఏంటో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మా టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే. మళ్లీ ముంబై ఇండియన్స్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే అన్నాడు.\
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
ఇక ముంబైలో విదేశీ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.. ట్రెంట్ బౌల్ట్‌కు ఎంతో అనుభవం ఉందన్నాడు.మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ సారథి క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. విల్ జాక్స్, రీస్ టోప్లేతో జట్టులో వైవిధ్యం తీసుకొచ్చాం. రియాన్ రికెల్‌టన్ యువ క్రికెటర్ దూకుడుతోపాటు నిలకడగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. భారత యువ ప్లేయర్లు ముంబైలో చాలామంది ఉన్నారు. వారితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’
rohit-sharma | mumbai-indians | telugu-news
Kodali Nani Health: కొడాలి నానికి సర్జరీ పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
Nabha Natesh: పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే
Muda scam: MP, MLAల స్పెషల్ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్
Heavy rains : మండుతున్న ఎండలకు కూల్ న్యూస్...నాలుగు రోజులు భారీవర్షాలు
Dhanush: 6 ఏళ్ళ తర్వాత ఓటీటీలో ధనుష్ తొలి హాలీవుడ్ ఫిల్మ్.! స్ట్రీమింగ్ ఎక్కడంటే