/rtv/media/media_files/2026/04/01/lsg-vs-dc-2026-04-01-21-23-06.jpg)
ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(delhi-capitals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(lucknow-super-giants) బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 35 పరుగులు, అబ్దుల్ సమద్ 36 పరుగులతో ఫర్వాలేదనిపించినా, మిగిలిన వారెవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో(dc vs lsg) వికెట్లు క్రమంగా పడిపోవడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
Also Read : భారత్ vs జింబాబ్వే: BCCI షెడ్యూల్ రిలీజ్!
చెరో మూడు వికెట్లు
ఢిల్లీ బౌలర్లలో నటరాజన్, లుంగీ ఎంగిడి అద్భుతంగా రాణించి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. వీరికి తోడుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ఢిల్లీ బౌలర్లు లక్నోను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో లక్నో చేసిన బ్యాటింగ్ ప్రయోగాలు బెడిసికొట్టాయి. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ 7 పరుగులకే వెనుదిరగ్గా, ఎయిడెన్ మార్క్రామ్ (11) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా నాలుగో స్థానంలో వచ్చిన ఆయుష్ బదోని డకౌట్‌గా వెనుదిరగడంతో లక్నో కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) కాసేపు పోరాడినా జట్టుకు భారీ స్కోరు అందించలేకపోయారు.
Also Read : న్యూ చండీగఢ్‌లో సంచలన మ్యాచ్.. గెలుపెవరిది..?
Follow Us