/rtv/media/media_files/2025/03/24/VJHrUjnwIWvpQ0QB3ZZD.jpg)
David Warner
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 రాబోయే సీజన్ కోసం కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో ఎంపిక కాని వార్నర్.. ఏప్రిల్ 11న ప్రారంభమయ్యే PSL (పాకిస్తాన్ సూపర్ లీగ్)లో పాల్గొననున్నాడు.
ఇందులో కింగ్స్‌కు కెప్టెన్‌గా నాయకత్వం వహించబోతున్నాడు. ఇందులో భాగంగానే వార్నర్ చేసిన సాహసాలను ఫ్రాంచైజ్ హైలైట్ చేసింది. ‘‘ప్రపంచ కప్ విజేత అనుభవజ్ఞుడు.. T20 క్రికెట్‌లో స్టార్ ఓపెనర్లలో ఒకరైన వార్నర్ ఈ పాత్రకు అనుభవ సంపదను తెస్తాడు’’ అని ఫ్రాంచైజ్ ఒక ప్రకటనలో రాసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
ఈ మేరకు కరాచీ ఫ్రాంచైజీ గత సీజన్ కెప్టెన్ షాన్ మసూద్‌కు ఫ్రాంచైజీలో తన పాత్రకు కృతజ్ఞతలు తెలిపింది. ‘‘మా కొత్త కెప్టెన్‌గా కరాచీ కింగ్స్ కుటుంబానికి డేవిడ్ వార్నర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. నాయకుడిగా, మ్యాచ్ విన్నర్‌గా అతని ట్రాక్ రికార్డ్ HBL PSL 10 కోసం సరిగ్గా సరిపోతుంది. అలాగే గత సీజన్‌లో షాన్ మసూద్ చేసిన అసాధారణ సహకారానికి మేము మా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బలమైన పునాదిని నిర్మించడంలో అతని ప్రయత్నాలు కీలకమైనవి. జట్టులో కీలక ఆటగాడిగా అతని పాత్ర కొనసాగుతుందని ఆశిస్తున్నాము" అని కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్ ఇక్బాల్ అన్నారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
కరాచీ జట్టు 2020లో ఒకసారి PSL టైటిల్‌ను గెలుచుకుంది. వారు 2021లో ప్లేఆఫ్స్‌కి వెళ్లారు. కానీ అప్పటి నుండి నాకౌట్‌లకు చేరుకోలేదు. వరుసగా మూడుసార్లు లీగ్ దశలోనే ఓడిపోయారు. 2020లో టైటిల్ గెలవడానికి ముందు.. వారు 2016 నుండి 2019 వరకు ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్‌లకు చేరుకున్నారు. ఇక ఇప్పుడు వార్నర్ నాయకత్వంలో కింగ్స్ జట్టు.. వారి అదృష్టం మారుతుందని, ఈ సీజన్‌లో మరొక టైటిల్ సాధిస్తామని ఆశిస్తుంది. ఏప్రిల్ 12న కరాచీలోని తమ సొంత స్టేడియంలో ముల్తాన్ సుల్తాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నారు.
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
కరాచీ కింగ్స్ జట్టు:
అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హంజా, కేన్ విలియమ్సన్, మీర్జా మమూన్, ఇంతియాజ్ మొహమ్మద్ నబీ, ఒమైర్ బిన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా ఉన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
(David Warner | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news)