/rtv/media/media_files/2025/03/28/m5ZnfTxGoxwBKAgo30Uh.jpg)
CSK VS RCB
ఐపీఎల్ 2025 సీజన్ నేడు ఉత్కంఠ సమరానికి సిద్ధమైంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
ఇప్పుడు ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన CSK జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో RCB జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రియులు స్టేడియానికి పరుగులు తీశారు. ధోనీ, విరాట్ ప్రత్యర్థులుగా తలపడనున్న ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (సి), రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, దీపక్ హుడా, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికె), ఆర్.అశ్విన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్ ఉన్నారు.
Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!