Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై నేడే తుది నిర్ణయం

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎక్కడ నిర్వహించాలనే దానిపై నేడు ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్‌లో ట్రోఫీ జరిగితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాదని బీసీసీఐ చెప్పింది. కనీసం హైబ్రిడ్ మోడల్ అయిన నిర్వహించాలని కోరింది. కానీ ఈ పద్ధతికి పాకిస్థాన్ ఒప్పుకోలేదు.

New Update
Champions Trophy

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాలి. అయితే ఈ టోర్నీకి టీమిండియా పాకిస్థాన్‌కి వెళ్లే ప్రసక్తి లేదని బీసీసీఐ ఐసీసీకి చెప్పింది. కనీసం హైబ్రిడ్ మోడల్ అయిన నిర్వహించాలని బీసీసీఐ కోరింది. కానీ ఈ పద్ధతికి అంగీకరించమని ఐసీసీకి పాకిస్థాన్ తెలిపింది. అయితే పాకిస్థాన్ వెలుపలు మరో వేదికలో ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇలా నిర్వహించిన కూడా హక్కులు అన్ని పాకిస్థాన్‌కే చెందుతాయి.

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగాలని..

ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఎక్కడ జరగాలనే విషయంపై బీసీసీఐ, ఐసీసీ వర్చువల్‌గా నేడు తుది నిర్ణయం తీసుకోకున్నారు. ఇండియా పాకిస్థాన్‌కి వెళ్తుందా? లేకపోతే ట్రోఫీ నిర్వహించే ప్లేస్‌ను మారుస్తారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. 

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

భారత్ పాకిస్థాన్‌కి వెళ్లేది లేదని ముందే బీసీసీఐ ఐసీసీకి చెప్పింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఇస్లామాబాద్‌లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం కరెక్ట్ కాదు. పోని ఇండియాను తప్పించి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన.. పాక్‌కి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

గతేడాదిలో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు ఆడింది. కానీ ఈసారి తప్పకుండా తమ దేశానికి రావాలని పాక్‌ నిర్ణయించుకుంది. అయితే ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పించుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకి అందే నిధుల్లో ఐసీసీ కోత విధిస్తుంది. పాక్‌లో జరగాల్సిన టోర్నీని పోస్ట్ పోన్ చేసిన లేకపోతే వేరే దేశానికి పంపిన కూడా ఆతిథ్య ఫీజు కింద వచ్చే రూ.548 కోట్లు ఇక పాకిస్థాన్‌కి రావు. 

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  

New Update
ipl 2025

DC VS LSG

లక్నో సూపర్ జెయింట్స్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  అభిషేక్‌ పోరెల్‌  36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 51 పరుగులు, కేఎల్‌ రాహుల్‌  42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు, అక్షర్‌ పటేల్‌  24 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లు 34 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచేశారు. ఢల్లీ బ్యాటర్లను సూపర్ జెయింట్స్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు.  లక్నో బౌలర్లలో మార్‌క్రమ్‌ రెండు వికెట్లు తీశాడు.

రాణించిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్..

లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.

today-latest-news-in-telugu | IPL 2025 | lsg | dc | match 

Also Read:  BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment