/rtv/media/media_files/2025/03/10/oTJlizW7cczQ9nN3Atww.jpg)
BCCI'S 58 CRORE PRIZE MONEY FOR TEAM INDIA
టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలవడంతో బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌న ప్రకటించింది. మొత్తం రూ.58 కోట్ల రూపాయలను బహుమతిగా అందజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం క్యాష్ ప్రైజ్‌ను జట్టులో ఉన్న ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) March 20, 2025
BCCI Announces Cash Prize for India's victorious ICC Champions Trophy 2025 contingent.
Details 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/si5V9RFFgX
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు..
టీమిండియాలో అందరూ చేసిన అద్భుతమైన ప్రదర్శనకి ఈ నజరానా ప్రకటించినట్లు బీసీసీఐ తెలిపింది. టీమిండియా దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. దీంతో బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. ఈ నెల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ మొదటి నుంచే న్యూజిలాండ్‌ను కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇప్పటి వరకు టీమిండియా జట్టు మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
BCCI'S 58 CRORES PRIZE MONEY FOR TEAM INDIA: 🇮🇳🏆
— Tanuj Singh (@ImTanujSingh) March 20, 2025
- 3 Crore for each player.
- 3 Crore for Head coach.
- 50 Lakhs for Support staff. pic.twitter.com/1AOkS40yH0
ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!