/rtv/media/media_files/2025/03/10/PQf6UcG0elw2ectsgdQU.jpg)
మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్,బీసీసీఐ మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్‌కు రాసిన లేఖ
లో, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ గోయెల్ అన్ని అనుబంధ ఈవెంట్‌లు, క్రీడా సౌకర్యాలలో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తులను నిషేధించాలని తెలిపారు.
Also read : తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Directorate General of Health Services (DGHS) writes to IPL Chairperson regarding the regulation of Tobacco and Alcohol advertisements including surrogate advertisementing and sales during the IPL season starting from 22nd March. pic.twitter.com/0kNvKHzWet
— ANI (@ANI) March 10, 2025
పొగాకు మరణాలలో రెండవ స్థానం
అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. ఐపీఎల్ ను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత మరణాలలో మనం రెండవ స్థానంలో ఉంది. దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్‌సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన లేఖలో వెల్లడించింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని వెల్లడించింది.
Also read : రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
Also read : ఫ్యామిలీతో వెళ్లి ప్రధానికి కలిసిన ఈటల.. ఆ పదవి ఫిక్స్ అయినందుకేనా?