Virat - Babar: విరాట్ రికార్డు బ్రేక్.. ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్..!

పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 6వేలకుపైగా పరుగులు పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు.

New Update
Babar Azam Breaks Asian Record, Beats Virat Kohli To Fastest 6,000 ODI Runs

Babar Azam Breaks Asian Record, Beats Virat Kohli To Fastest 6,000 ODI Runs

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోర్నీ కోసం ఇప్పటికే పలు జట్లు సిద్ధమయ్యాయి. దీని కంటే ముందు భారత్ - ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్, వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ వేదికగా ముక్కోణపు (వన్డే ఫార్మాట్) జరుగుతోంది. ఈ సిరీస్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రసవత్తరంగా సాగుతోంది. 

Also Read: Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!

ఇందులో భాగంగానే నేడు పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరిన బాబర్ అజామ్.. తన ఖాతాలో ఓ రికార్డు వేసుకున్నాడు. 

Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

Also Read: Fastag: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

బాబర్ మరో రికార్డు

వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్‌ను అందుకొన్న ప్లేయర్‌గా అగ్ర స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాతో కలిసి బాబర్ సంయుక్తంగా ఈ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు కేవలం 123 ఇన్నింగ్‌లలో 6 వేల పరుగులు చేసి విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి ఈ ఫీట్ అందుకున్నారు. 

విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్ (139), కేన్‌ విలియమ్సన్ (139)తో తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా విరాట్ కోహ్లీ 2014లోనే ఈ ఘనత సాధించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా బాబర్ 97 ఇన్నింగ్‌లలో 5వేల పరుగులు చేశాడు. కానీ మరో 1000 పరుగులు చేయడానికి దాదాపు 26 ఇన్నింగ్‌లు తీసుకోవడం గమనార్హం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు