/rtv/media/media_files/2025/03/15/Gc5bXxTZoZtYfQcyLP4G.jpg)
Australian opener Nathan McSweeney praises Indian pacer Bumrah bowling
భారత స్టార్ పేసర్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు బౌలింగ్ వేస్తున్నాడంటే.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా.. బుమ్రా బంతికి తగ్గాల్సిందే. అతడు వేసిన 6 బాల్లను ఎలా డిఫెన్స్ చేయాలా? అని బ్యాటర్లు తలలు పట్టుకుంటారు. అతడి స్పీడ్‌కు గజగజ వణుకుతుంటారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ఒక గగనం అనే చెప్పాలి. గతేడాది బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయినా బుమ్రా మాత్రం అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అదే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనేని 3 టెస్టుల్లో 4సార్లు బుమ్రా ఔట్ చేశాడు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
బుమ్రా నుంచి సవాల్ ఎదురైంది
తాజాగా బుమ్రా బౌలింగ్ పై ఆసీస్ ఓపెనర్ నాథన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు బుమ్రా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారత పేసర్ బుమ్రాను అర్థం చేసుకోవడంలో ఘోరంగా ఫెయల్ అయినట్లు తెలిపాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తమకు బుమ్రా నుంచి చాలా సవాల్ ఎదురైనట్లు చెప్పాడు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
అతడు ఒక అద్భుతమైన బౌలర్ అని.. తాను బుమ్రా బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలం అయినట్లు తెలిపాడు. అంతకముందు ఎప్పుడూ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడమే దీనికి ముఖ్య కారణం అని అన్నాడు. తానొక్కడు మాత్రమే కాకుండా.. తన జట్టులోని ఇతర ప్లేయర్లు సైతం బుమ్రాపై ఆధిక్యం ప్రదర్శించలేకపోయారు అని అన్నాడు. తనకు అది కాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ ట్రోఫీలో తనను మాత్రమే కాకుండా.. జట్టు మొత్తాన్ని బుమ్రా టార్గెట్ చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...