/rtv/media/media_files/2025/03/29/E90oUdh2GLkhWa0z3Y5U.jpg)
Rcb In Chennai
ఐపీఎల్ మొదలైన కొత్తల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా ఉండేవాడు. అప్పుడు 17 ఏళ్ళ క్రితం మిస్టర్ వాల్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలిచింది. తరువాత ప్రతీ ఏడాది ఐపీఎల్ జరుగుతూనే ఉంది. బెంగళూరు జట్టు చెన్నైలో మ్యాచ్ లు ఆడుతూనే ఉంది. ఆ జట్టుకు కెప్టెన్లు కూడా మారుతూనే ఉన్నారు. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఎట్టకేలకు నిన్న రజత్ పాటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు దీన్ని బ్రేక్ చేసింది. చెన్నైలో చెన్నైని ఓడించి సూపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డ మీద చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెక్ పెట్టింది.
చెన్నైలో చెన్నైకు చెక్..
2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో గెలిచాక అక్కడ ఆడిన ప్రతిసారీ ఓడుతూ వచ్చిన బెంగళూరు.. ఎట్టకేలకు ఫలితాన్ని మార్చింది. చెన్నై వెర్సస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే సీఎస్కేనే గెలుస్తుంది...బెంగళూరు ఓడిపోతుంది అన్న అంచనాలను తారు మారు చేసింది. చెన్నై మీద ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టులోని బౌలర్లు నిన్న విజృంభించేశారు. హేజిల్‌వుడ్ (3/21), యశ్ దయాళ్ (2/18), లివింగ్‌స్టన్ (2/28) సత్తా చాటారు. బ్యాటర్లలో రజత్ పాటీదార్ (51; 32 బంతుల్లో 4×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు ఫిల్ సాల్ట్ (32; 16 బంతుల్లో 5×4, 1×6), పడిక్కల్ (27; 14 బంతుల్లో 2×4, 2×6), టిమ్ డేవిడ్ (22 నాటౌట్; 8 బంతుల్లో 1×4, 3×6) దడదడలాడించారు.
చెపాక్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 197 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కేకు ఇచ్చింది. చెన్నై స్టేడియంలో 197 పరుగుల అంటే పెద్ద లక్ష్యమనే చెప్పాలి. అయితే సీఎస్కే జట్టులో అందరూ మంచి బ్యాటర్లే ఉండడంతో కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ కానీ ఆ జట్టు ఏ దశలోనూ విజయానికి రేసులో లేదు. హేజిల్‌వుడ్ తన తొలి ఓవర్లోనే త్రిపాఠి (5), రుతురాజ్ (0)లను ఔట్ చేసి చెన్నైకి చెక్ పెట్టాడు. దీపక్ హుడా (4), సామ్ కరన్ (8) అందరూ సింగిల్ డిజిట్లకే పెవిలియన్ బాట పట్టారు. ఒక్క రచిన్ రవీంద్ర మాత్రమే వికెట్ ను కాపాడుకుంటూ వచ్చాడు. చివర్లో ధోనీ వచ్చి మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు కొట్టినా...అప్పటికే ఫలితం తేలిపోవడంతో...చెన్నై మ్యాచ్ ను ఓడిపోవాల్సి వచ్చింది.
today-latest-news-in-telugu | ipl-2025 | csk-vs-rcb
Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!