/rtv/media/media_files/2025/02/26/BjOpQgL7UH2jqZWodnRQ.jpg)
Afghanistan Won The Match
తన సత్తాను మొత్తానికి నిరూపించింది ఆఫ్ఘనిస్థాన్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ మీద ఎనిమిది పరుగుల తేడాలో మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కు ఇచ్చింది. ఈ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. జో రూట్ (120; 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఒవర్టన్ (27) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకం సాధించాడు. జద్రాన్ 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేశాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Also Read: USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా