/rtv/media/media_files/2025/04/02/gTj4ER2j87ia9tr9zbJ7.jpg)
pant IPL 2025
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్, కెప్టెన్ గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.
Rishabh Pant can’t even tie Shoe laces of Sanju Samson.
— 🧢🩷 (@Rosh_met_Sanju) April 1, 2025
Scored 17 runs in 3 matches, AVG 5.66, strike rate of 65 and he defeated LSG single-handedly in the first match
Thanks to Gautam Gambhir for removing fraud player sympathy merchant, PR kid from my beautiful T20i team. pic.twitter.com/os0JI5Vw3n
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జట్టులోకి వచ్చిన పంత్ నుల ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ చరిత్ర సృష్టించింది, తద్వారా అతను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
గాయం తరువాత కోలుకుని టీమ్ లోకి వచ్చిన పంత్ కు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లోకి వచ్చేసరికి పంత్ ఎక్కువగా బెంచ్ మీదే గడిపాడు. ఐపీఎల్‌కు ముందు జనవరిలో ఢిల్లీ తరఫున జరిగిన ఏకైక రంజీ మ్యాచ్ మ్యాచ్ ఆడాడు. అందులో అతను రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అక్టోబర్ నుండి పంత్ ఒక్క పరిమిత ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేదు.
రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్
రిషబ్ పంత్ 114 ఇన్నింగ్స్‌ల్లో 34.39 సగటుతో 3301 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 34.39, స్ట్రైక్ రేట్ 147.96తో 296 ఫోర్లు, 155 సిక్సర్లు కొట్టాడు. 2024లో రిషబ్ పంత్ 13 మ్యాచ్‌ల్లో 40.55 సగటు, 155.40 స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు .