Chess: యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం

18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. 

New Update
2

దొమ్మరాజు గుకేశ్...ఇప్పుడు ఇతను ప్రపంచ చెస్ రారాజు. 18ఏళ్ళ వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకుని అరుదైన రికార్డ్‌ను కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌ తో జరిగిన   పోరులో విజేతగా నిలిచాడు. ఈ చివరి ఆట ఆద్యంతం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగింది. చివరికి విజయం గుకేశ్‌నే వరించింది. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

Also Read :  Gukesh: వామ్మో.. చెస్‌ ఛాంపియన్‌ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !

Also Read :  AP: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు

chess

ఉత్కంఠంగా సాగిన పోరు..

సుమారు 5 గంటలపాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. విజయం కోసం 18 ఏళ్ల గుకేశ్‌ గట్టిగానే ప్రయత్నించినా.. ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్‌ ముగించేందుకు అంగీకరించారు. ఇవాళ జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో  ఒక పాయింట్‌ సాధించిన గుకేశ్‌ విజేతగా నిలిచాడు. ఈటోర్నీలో గుకేశ్ మొదటి నుంచి పెద్ద పెద్ద ఆటగాళ్ళను తోసిరాజనుకుంటూ వచ్చాడు. నెపోమ్నియాషి, కరువానా, నకముర వంటి మేటి గ్రాండ్‌మాస్టర్స్‌పై విజయం సాధించాడు. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టడంలో కూడా గుకేశ్ కీలక పాత్ర పోషించాడు.  

Also Read: SC: కేంద్రం స్పందించేవరకూ ఆగండి..ప్రార్థనా స్థలాల కేసులో సుప్రీంకోర్టు

Also Read :  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 14న మెగా జాబ్ మేళా!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు